న్యూఢిల్లీ: కొత్త ఇన్వెస్టర్ స్విగ్గీ నాయకత్వంలో సిరీస్ డీ రౌండ్ ఫండింగ్ ద్వారా 180 మిలియన్ డాలర్లు (రూ. 1,370 కోట్లకు పైగా) సేకరించినట్లు బైక్ టాక్సీ ప్లాట్‌ఫారమ్ ర్యాపిడో శుక్రవారం తెలిపింది. టీవీఎస్ మోటార్ కంపెనీతోపాటు పాత పెట్టుబడిదారులు వెస్ట్‌బ్రిడ్జ్, షెల్ వెంచర్స్, నెక్సస్ వెంచర్స్ నుండి కూడా పెట్టుబడులు వచ్చాయని కంపెనీ తెలిపింది. టెక్నాలజీని పెంచడం, టీమ్స్‌ను బలోపేతం చేయడం వంటి పనులకు ఈ డబ్బును వాడతారు. బైక్‌ట్యాక్సీ, ఆటో, డెలివరీ కేటగిరీల డెవెలప్మెంట్కు భారీగా ఖర్చు చేస్తామని వెల్లడించింది. వంద సిటీల్లోని తమ పార్ట్నర్ల ఆదాయాలు పెంచేలా చేస్తామని ప్రకటించింది. ర్యాపిడో గతంలోనూ పలువురు ఇన్వెస్టర్ల నుంచి 130 మిలియన్ డాలర్లు సేకరించింది. దీనికి 15 లక్షల మంది డ్రైవర్లు, 2.5 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు.
