బైక్​ చోరీలు చేస్తున్న ఫ్యామిలీ అరెస్ట్

బైక్​ చోరీలు చేస్తున్న ఫ్యామిలీ అరెస్ట్

ఓయూ, వెలుగు : బైక్​చోరీలకు పాల్పడుతున్న తల్లి, తండ్రి, కొడుకును ఓయూ పోలీసులు అరెస్ట్​చేశారు. వారి నుంచి ఆరు  బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ జగన్​తెలిపిన వివరాల ప్రకారం.. మల్లాపూర్ గోకుల్ నగర్ కు చెందిన అబ్దుల్ సమద్(41) ఫాస్ట్​ఫుడ్​సెంటర్​తోపాటు స్క్రాప్​బిజినెస్​చేస్తున్నాడు. ఇతను గతంలో బైక్​దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లివచ్చాడు. జల్సాల అలవాటు పడి భార్యను వదిలేశాడు. తర్వాత గోకుల్​నగర్​కు చెందిన సాహెరా(30) అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఒక కొడుకు(మైనర్) ఉన్నాడు.  

అబ్దుల్​సమద్​భార్య, కొడుకుతోపాటు కొడుకు ఫ్రెండ్​తో కలిసి గ్యాంగ్​గా ఏర్పడి బైక్​లు చోరీ చేయడం ప్రారంభించారు. మైనర్లు ఇద్దరూ కొట్టేసి తీసుకొచ్చిన బైకులను సమద్, సాహెర విక్రయిస్తున్నారు. గత నెల 21న ఓయూ మాణికేశ్వరీనగర్ మసీదు వద్ద పార్క్​చేసిన బైక్​ను కొట్టేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ఇద్దరు మైనర్లను అరెస్టు చేశారు. వారి సమాచారంతో సమద్, సాహెరాను అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు. ఇప్పటివరకు 11 బైక్​లను చోరీ చేసినట్లు నిందితులు అంగీకరించారు.

వారి నుంచి ఆరు బైక్​లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ జగన్​వెల్లడించారు. మరో కేసులో దువ్వల లాజరు అలియాస్​రాము(19), కోనేటి రాజేశ్(19) ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్​చేశారు. వీరిద్దరూ జల్సాల కోసం బైక్​దొంగతనాలు చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదుతో రాము, రాజేశ్​ను ఓయూ పోలీసులు అరెస్ట్​చేశారు. రెండు బైక్​లను స్వాధీనం చేసుకున్నారు.