బిల్కిస్ బానో కేసు.. నిందితుల విడుదలపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్

బిల్కిస్ బానో కేసు.. నిందితుల విడుదలపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్

2002 గుజరాత్ అల్లర్లలో తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 11మందిని ముందస్తుగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ.. బిల్కిస్ బానో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 11మంది దోషులను విడుదల చేసేందుకు 1992 నాటి రిమిషన్ నిబంధనలను వర్తింపజేయడానికి గుజరాత్ ప్రభుత్వానికి అనుమతి ఇస్తూ.. సుప్రీంకోర్టు మే నెలలో ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా బిల్కిస్ బానో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. లిస్టింగ్ కోసం భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ముందు ఆమె లాయర్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. రెండు పిటిషన్లను కలిపి విచారించవచ్చా..?ఒకే బెంచ్ ముందు విచారించవచ్చా..? అనే అంశాన్ని పరిశీలిస్తామని సీజేఐ చెప్పారు.

జీవిత ఖైదు పడిన 11మందిని గుజరాత్ ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన విడుదల చేసింది. ఇక ఈ కేసులో జీవిత ఖైదీలుగా ఉన్న మొత్తం 11మందిని 2008లో దోషులుగా నిర్ధారించే సమయంలో గుజరాత్‌లో ఉన్న రిమిషన్ పాలసీ ప్రకారం విడుదల చేశారు. ఇక గుజరాత్ లో 2002లో జరిగిన సామూహిక అత్యాచార ఘటన సంచలనం కలిగించిందో అందరికీ తెలిసిందే. బిల్కిన్ బానో అనే గర్భిణిపై 11మంది నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడడంతో పాటు ఆమె కుటుంబ సభ్యులను హత్య చేశారు. ఈ ఘటనపై నిందితులకు కోర్టు 2008లో జీవిత ఖైదు విధించింది. అయితే ఈ ఏడాది ఆగస్టు 15న వారిని గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై  ప్రస్తుతం బాధితురాలితో పాటు పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.