టీ20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఇండియాలో మ్యాచ్ లు ఆడేందుకు సిద్ధంగా ఐసీసీకి చెప్పిన సంగతి తెలిసిందే. 2026 టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు ఇండియాకు వెళ్లడం ఇష్టం లేదని ఐసీసీకి బంగ్లాదేశ్ ఈమెయిల్ ద్వారా తెలిపింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఈ నిర్ణయం తీసుకుంది. బంగ్లా క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను ఐపీఎల్ 2026 నుంచి తొలగించిన తర్వాత బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తక్షణమే ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ఐసీసీకి పెద్ద తలనొప్పిగా మారింది. తాజా సమాచార ప్రకారం బంగ్లాదేశ్ ను ఐసీసీ ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
రిపోర్ట్స్ ప్రకారం ఇండియా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య ఉద్రిక్తతను తగ్గించడానికి ఐసీసీ ప్రయత్నాలు చేస్తోంది. 2026 టీ20 ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ ఆడబోయే మ్యాచ్ లను ఇండియా నుంచి శ్రీలంకకు తరలించాలన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) రిక్వెస్ట్ ను ఐసీసీ ఒకసారి పునరాలోచించమని కోరింది. బీసీబీ తమ విజ్ఞప్తిని వెనక్కి తీసుకోవడానికి ఐసీసీ నుండి సమయం కోరింది. ఆ దేశ ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాతే తాము తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.సోమవారం (జనవరి 5) బీసీసీఐ, బీసీబీ అధికారుల మధ్య ఐసీసీ మీటింగ్ నిర్వహించినట్టు సమాచారం.
Also Read : డబుల్ సెంచరీతో తెలుగు క్రికెటర్ సంచలనం
టీ20 ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేయడానికి ఐసీసీ సిద్ధంగా ఉందని.. ఇండియాలో బంగ్లాదేశ్ ఆటగాళ్లకు పూర్తి భద్రత కల్పిస్తామని ఐసీసీ హామీ ఇచ్చినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. " ఐసీసీ బంగ్లాదేశ్‌ను ఇండియాలో మ్యాచ్ లు ఆడేందుకు ఒప్పించే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో కేవలం రెండు జట్లు మాత్రమే కాదు. ప్రేక్షకులు, ఫ్యాన్స్, ప్రయాణ మీడియా కూడా ఇందులో ఉంటుంది". అని ఐసీసీతో సంబంధం ఉన్న ఒక అనుభవజ్ఞుడైన అధికారి తెలిపారు. ఒకవేళ బంగ్లాదేశ్ ఒప్పుకోకపోతే ఐసీసీ ప్లాన్ బి రెడీ చేయక తప్పదు. మరికొన్ని రోజుల్లో బంగ్లాదేశ్ ఇండియాలో మ్యాచ్ లు ఆడుతుందా లేదా అనే విషయంలో క్లారిటీ వస్తుంది.
వరల్డ్ కప్ కు నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో త్వరలోనే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరోవైపు బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లను మార్చాలన్న నిర్ణయాన్ని బీసీసీఐ తిరస్కరించింది. దీనిని లాజిస్టికల్ పీడకలగా చెప్పుకొచ్చింది. ఐసీసీకి పంపిన మెయిల్ లో మూడు విషయాలను గురించి ప్రస్తావించారు. మొదటిది ముస్తాఫిజుర్ ను ఐపీఎల్ 2026 నుంచి ఎందుకు తొలగించారు. రెండోది ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్ కు భద్రతా విషయంలో ఆందోళనలు ఉన్నాయని.. ఆటగాళ్లు మాత్రమే కాకుండా వారితో పాటు మీడియా, అభిమానులు, స్పాన్సర్లు కూడా ప్రపంచ కప్‌ను చూడటానికి ఇండియాకు వస్తారని BCB అధికారి ఒకరు అన్నట్టు సమాచారం.
టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకారం ఇండియాలో బంగ్లాదేశ్ మొత్తం నాలుగు లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. మూడు కోల్‌కతాలో ఒకటి ముంబైలో జరగనుంది. ఫిబ్రవరి 7న వెస్టిండీస్, ఫిబ్రవరి 9న ఇటలీ, ఫిబ్రవరి 14న ఇంగ్లాండ్ తో కోల్‌కతాలో మ్యాచ్ లు ఆడనుంది. ఫిబ్రవరి 17న ముంబైలో నేపాల్ తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ నాలుగు మ్యాచ్ లను శ్రీలంకలో ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖతో పాటు బంగ్లా క్రికెట్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వివాదంపై అటు ఐసీసీ.. ఇటు బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.
