బిల్ గేట్స్ కు జీవితకాల సాఫల్య పురస్కారం

బిల్ గేట్స్ కు జీవితకాల సాఫల్య పురస్కారం

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కు విశిష్ట గౌరవం లభించింది. టై గ్లోబల్.. అనే సంస్థ బిల్ గేట్స్ కు జీవితకాల సాఫల్య పురస్కారం అందించింది. వర్చువల్ గా జరిగిన ఓ కార్యక్రమంలో ‘టై గ్లోబల్’ ఈ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును గేట్స్ కు ప్రదానం చేసింది.  ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన …ప్రపంచం ఎదుర్కొంటున్న కఠినమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆవిష్కరణలే కీలకమన్నారు. కరోనా వంటి మహమ్మారిని ఎదుర్కొనడంలోనూ ఆవిష్కరణలే కీరోల్ పోషిస్తాయన్నారు. అయితే ఆవిష్కర్తలు ప్రతిదీ సొంతంగా రూపొందించలేరు..దీనికి భాగస్వాములు, మద్దతుదారుల సహకారం అవసరమని అభిప్రాయపడ్డారు.పరిశోధకుల ఆలోచనలు ప్రయోగశాల దాటి విపణికి చేరాలంటే ఎంతోమంది చేయూతనివ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు బిల్ గేట్స్.