ప్రధాని మోడీని కొనియాడిన బిల్ గేట్స్

ప్రధాని మోడీని కొనియాడిన బిల్ గేట్స్

భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అందులో భాగంగా ఆరోగ్య సంరక్షణ, డిజిటలైజేషన్‌కు అత్యంత ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినందుకు ప్రధాని మోడీపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా ఈ రెండు రంగాలలో భారతదేశం పురోగతిని సాధించడం నిజంగా స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ అభివృద్ధిలో తాము కూడా భాగస్వాములు కావడం అదృష్టమంటూ బిల్ గేట్స్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

యావత్ భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసి, గౌరవ సైనిక వందనాన్ని స్వీకరించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దేశ స్వాతంత్య్ర సమరయోధుల కలలను సాధ్యమైనంత త్వరగా సాకారం చేయాల్సిన బాధ్యత భారతీయులందరిపై ఉందని మోడీ అన్నారు. యావత్ జీవితాన్ని దేశం కోసం అంకితం చేసిన వాళ్లను మరువలేమని పేర్కొన్నారు. దేశపు మట్టిపై ఉన్న ప్రేమతో స్వాతంత్య్ర సమర యోధులు వీరోచిత పోరాటం చేసి..   మనకు స్వాతంత్య్రాన్ని సాధించి పెట్టారని ప్రధాని మోడీ గుర్తుచేశారు.