
ప్రముఖ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్‌కు బిల్‌గేట్స్ రాజీనామా చేశారు. ప్రస్తుతం బోర్డ సలహాదారుడిగా ఉన్న బిల్‌గేట్స్ ఆ పదవికి కూడా రాజీనామా చేశారు. అంతేకాకుండా.. వారెన్ బఫెట్ కంపెనీ కూడా ఆయన వైదొలిగారు. 1975లో బిల్‌గేట్స్ మైక్రోసాఫ్ట్‌ను ఆయన స్థాపించారు. 2014లో మైక్రోసాఫ్ట్ చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. ఇక నుంచి పూర్తి సమయం సామాజిక కార్యక్రమాలకు కేటాయిస్తానని ఆయన తెలిపారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌కు సత్యం నాదేళ్ల చైర్మన్‌గా కొనసాగుతున్నారు.