కరోనా కట్టడికి మోడీ తీసుకున్న చర్యలు బాగున్నాయి

కరోనా కట్టడికి మోడీ తీసుకున్న చర్యలు బాగున్నాయి

భారత్ లో కరోనా ను అరికట్టేందుకు మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీని అభినందిస్తూ లేఖ రాశారు. భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చేపట్టిన లాక్ డౌన్, హాట్ స్పాట్ కేంద్రాల గుర్తింపు, వైరస్ బారినపడ్డ వారిని ఐసోలేషన్ కేంద్రాలకు, అనుమానితులను క్వారంటైన్ లో ఉంచడం వంటి చర్యలు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. అంతేకాదు కరోనా  బాధితులకు వైద్యుల సేవలను, ’ఆరోగ్య సేతు’ వంటి యాప్ లను అందుబాటులోకి తేవడాన్ని ఆయన కొనియాడారు.