
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బిల్లా రంగా బాషా’. అనూప్ భండారి దర్శకత్వం వహిస్తున్నాడు. ఫస్ట్ బ్లడ్ అనేది క్యాప్షన్. ‘హనుమాన్’ నిర్మాతలు నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మంగళవారం సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో సుదీప్ డిఫరెంట్ గెటప్‌లో కనిపిస్తూ ఆకట్టుకున్నాడు.
2209 ఏడీ ఫ్యూచర్‌లో సెట్ చేయబడిన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే అడ్వంచర్ జర్నీ ఇదని, ఇంతకు ముందెప్పుడూ చూడని సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ప్రేక్షకులకు అందించబోతోందని ఈ సందర్భంగా మేకర్స్ తెలియజేశారు. పాన్ ఇండియా మూవీగా దీన్ని రూపొందిస్తున్నారు. ‘విక్రాంత్ రోనా’ తర్వాత సుదీప్, అనూప్ భండారి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ‘మ్యాక్స్’ ఫేమ్ విజయ్ కార్తికేయ డైరెక్షన్ ‘మార్క్’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో సుదీప్ నటిస్తున్నాడు. ఈ ఏడాది క్రిస్మస్‌కు ఇది విడుదల కానుంది.