న్యూఢిల్లీ: బిల్లీ జీన్ కింగ్ కప్‌లో ఇండియా రెండో విజయాన్ని అందుకుంది. ఆసియా ఓషినియా గ్రూప్–1లో భాగంగా గురువారం జరిగిన మూడో మ్యాచ్‌లో ఇండియా 2–1తో చైనీస్ తైపీని ఓడించింది. సింగిల్స్‌లో రుతుజా భోంస్లే 6–3, 6–2తో హవో చింగ్ చాన్‌పై గెలిచింది. కానీ రెండో సింగిల్స్‌లో అంకితా రైనా 6–2, 4–6, 4–6తో ఎన్ షువో లియాంగ్ చేతిలో ఓడింది. నిర్ణయాత్మక డబుల్స్ మ్యాచ్‌లో ప్రార్థన తొంబ్రే–అంకితా రైనా 4–6, 6–1, 15–13తో హావో చింగ్ చాన్–ఎన్ షు లియాంగ్‌పై గెలిచారు.
