500 డాలర్ల అద్దె ఇంట్లో బిలియనీర్ కొడుకు

500 డాలర్ల అద్దె ఇంట్లో బిలియనీర్ కొడుకు

ఈ రోజుల్లో కాస్త డబ్బుంటేనే కళ్లు నేలమీద ఉండవు. వారి ఊహలన్నీ ఆకాశంలోనే విహరిస్తుంటాయి. అలాంటిది కోన్ని కోట్లకు ఆ యువకుడు అధిపతి. అయినా కూడా రెంట్ ఇంట్లో ఉంటున్నాడు. అలెగ్జాండర్ ఫ్రిడ్ మాన్ రష్యాలోని 11వ ధనవంతుడి కుమారుడు. అలాంటి ఫ్రిడ్ మాన్ నెలకు 500 డాలర్లు చెల్లించి రెండు రూంల ఫ్లాట్‌లో అద్దెకుంటున్నాడు. ఎందుకు ఉంటున్నాడో తెలుసుకోవాలనుందా..

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. అలెగ్జాండర్ తండ్రి మిఖాయిల్ ఫ్రిడ్ మాన్ 13.7 బిలియన్ డాలర్లతో రష్యాలో 11వ ధనవంతుడు. అయినప్పటికీ, ఆయన కొడుకైన అలెగ్జాండర్ మాత్రం మాస్కో శివార్లలో 500 డాలర్ల ఖరీదు చేసే రెండు గదుల ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. ‘నేను సంపాదించిన డబ్బులతోనే బ్రతకాలని నేను నిర్ణయించుకున్నాను. అందుకే నేను నా తండ్రి ఆస్తిని ఆశించకుండా కష్టపడి సంపాదిస్తున్నాను’ అని అలెగ్జాండర్ అంటున్నాడు.

అలెగ్జాండర్ గత సంవత్సరం లండన్‌లో తన గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. అతను అయిదు నెలల క్రితం అయిదుగురు ఉద్యోగులతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు ఆ వ్యాపారం ఆదాయం 405,000 డాలర్లు. అంతేకాకుండా.. అలెగ్జాండర్ మాస్కోలోని రెస్టారెంట్లకు హుక్కా ఉత్పత్తులను పంపిణీ చేసే మరో వ్యాపారాన్ని కూడా ప్రారంభించాడు. ఇప్పుడు కొత్తగా బ్లాగర్ పాస్‌ అనే ఆన్‌లైన్ మార్కెటింగ్ వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నాడు. అలెగ్జాండర్ తన కంపెనీ ఉత్పత్తులను ఇతర దుకాణాలతో పాటు తన తండ్రికి చెందిన దుకాణాలకు కూడా సరఫరా చేస్తున్నాడు. అలెగ్జాండర్ ఇలా తన కాళ్ల మీద తాను నిలబడి ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తున్నాడు.

For More News..

వైరల్ వీడియో: జింకను గన్‌తో కాల్చి.. కత్తితో గొంతు కోసిన వ్యక్తి

కొన్నది 25 వేలకి.. అమ్మితే వచ్చేది 5 కోట్లు

వీడియో: భారత్, న్యూజిలాండ్ మూడో T20లో విచిత్ర సంఘటన