'బింబిసార' నుంచి మరో ట్రైలర్

'బింబిసార' నుంచి మరో ట్రైలర్

నందమూరి కళ్యాణ్‌ రామ్ ప్రస్తుతం 'బింబిసార' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు శ్రీ వశిష్ఠ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ సరసన క్యాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 5న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే మరో ట్రైలర్ వదిలారు మేకర్స్. 

ఈ డిజిటల్ ట్రైలర్ ను జూనియర్ ఎన్టీఆర్‌ రిలీజ్ చేశాడు. అలాగే ఈ నెల 29 వ తేదీన శిల్పకళా వేదికలో ఈ ఈవెంట్‌ జరుగనుండగా.. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ రానున్నారు. ఇక ఈ కొత్త ట్రైలర్‌లో హద్దులను చెరిపేస్తూ.. రాజ్యపు సరిహద్దులను ఆపై రాజ్యాలను దాటి విస్తరించాలి. శరణు కోరితే ప్రాణ భిక్ష... ఎదిరిస్తే మరణం.. నాడైనా.. నేడైనా త్రిగర్తల చరిత్రను తాకాలంటే.. బింబిసారుడి కత్తిని దాటాలి. మొత్తంగా రాజుగా.. సాధారణ వ్యక్తిగా కళ్యాణ్ రామ్ ఆహార్యం బాగుంది. మొత్తంగా కళ్యాణ్ రామ్ తన కెరీర్‌లో చేయనటువంటి చాలెంజింగ్ పాత్రను ‘బింబిసార’లో చేశాడు.