బీఆర్​ఎస్​ కౌన్సిలర్​రాజీనామా : బింగి శివానీ

బీఆర్​ఎస్​ కౌన్సిలర్​రాజీనామా : బింగి శివానీ

కోల్​బెల్ట్, వెలుగు : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం క్యాతనపల్లి మున్సిపల్​ 15వార్డు బీఆర్ఎస్​ కౌన్సిలర్​ బింగి శివానీ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. జిల్లాలో ఆదివారం మంత్రి కేటీఆర్​ పర్యటించనున్న నేపథ్యంలో అధికార పార్టీ కౌన్సిలర్​ రాజీనామా చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. 

కౌన్సిలర్​ బింగి శివానీ తన రాజీనామాను మున్సిపల్ కమిషనర్​వెంకటనారాయణకు అందించారు.  మున్సిపల్​పాలకవర్గంలో ప్రజల సమస్యలపై మాట్లాడలేని పరిస్థితి ఉందన్నారు. ఏదీ చెబితే దానికి చేతులు ఎత్తి రావడం తప్ప స్వేచ్ఛ లేకుండా పోయిందని, ఇందుకు ఎమ్మెల్యే బాల్క సుమన్​ నియతృత్వ పొకడలే కారణమని ఆరోపించారు.