మిలిటెంట్ పోరాటాలకు సిద్ధమన్న బినోయ్ విశ్వం

మిలిటెంట్ పోరాటాలకు సిద్ధమన్న బినోయ్ విశ్వం

భూపోరాటాలపై మిలిటెంట్ పోరాటాలకు సిద్ధమన్నారు సీపీఐ పార్లమెంటరీ పక్ష నాయకుడు బినోయ్ విశ్వం. హన్మకొండలో ఆయన మాట్లాడుతూ..భూపోరాటాలను ప్రభుత్వాలు అణచివేస్తున్నాయన్నారు. దేశంలో సొంత ఇల్లు లేని నిరుపేదలు ఎంతో మంది ఉన్నారని తెలిపారు. బీజేపీది బుల్డోజర్ ప్రభుత్వమన్న బినోయ్ ఢిల్లీలోనూ పేదల ఇళ్లను కూల్చివేశారని మండిపడ్డారు. జాతీయ స్థాయిలో భూ సమస్య ఉందని..దానికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని చెప్పారు. వరంగల్ లో భూపోరాలు అద్భుతంగా జరుగుతున్నాయని ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వం భూ ఉద్యమాలను అణిచి వేయాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ మాఫియాతో ప్రభుత్వం చేతులు కలిపిందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన మాటతప్పింది కాబట్టే పేదలు రోడ్డెక్కారన్నారు. వరంగల్ లో చెరువులు, కుంటలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. మాట తప్పిన కేసీఆర్ కు పదవిలో కొనసాగే హక్కు లేదన్నారు బినోయ్ విశ్వం. టీఆర్ఎస్ ప్రభుత్వంపై సీపీఐ ఉద్యమిస్తుందన్న ఆయన పేదలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.

 

మరిన్ని వార్తల కోసం

ఇవాళ పల్లె,పట్టణ ప్రగతిపై కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

లండన్ లో కేటీఆర్ కు ఘన స్వాగతం