ఇవాళ పల్లె,పట్టణ ప్రగతిపై కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

ఇవాళ పల్లె,పట్టణ ప్రగతిపై కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
  • ఇవాళ పల్లె, పట్టణ ప్రగతిపై సీఎం సమీక్ష
  • ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలపై ఆరాతీయనున్న సీఎం
  • ఐదో విడుత పల్లె, పట్టణ ప్రగతిలో చేపట్టాల్సిన అంశాలపై చర్చ

ఇవాళ క్యాంప్ ఆఫీస్ లో పల్లె, పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కార్పోరేషన్ మేయర్లు, అన్ని జిల్లాల కలెక్టర్లు సహా ఉన్నాతాధికారులు  పాల్గొననున్నారు. ఇప్పటికే నాలుగు విడుతల్లో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు జరిగాయి. ఇప్పటివరకు పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో ఎలాంటి కార్యక్రమాలు జరిగాయి..ఈనెల 20 నుంచి వచ్చేనెల 5 వరకు చేపట్టే పల్లె పట్టణ ప్రగతిలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే విషయంపై చర్చించనున్నారు. 

పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతిరోజు పారిశుద్ధ్యం, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచడం, డంపింగ్ యార్డుల్లో చెత్త ద్వారా ఆదాయ మార్గాలు, మొక్కలకు అనువైన ప్రదేశాల గుర్తించి, మొక్కల పెంపకం, పంచాయతీలలో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు పూర్తయ్యయా లేదా తెలుసుకోనున్నారు సీఎం. డంపింగ్ యార్డుల్లో తడి చెత్త నుంచి కంపోస్ట్ తయారు చేయటంతోపాటు పొడి చెత్త కొనుగోలుకు ట్రేడర్లతో అనుసంధానం చేసుకోవాలని సూచించనున్నారు. పల్లె పట్టణ ప్రగతిలో రాష్ట్రవ్యాప్తంగా హరితహారంలో భాగంగా మొక్కలు నాటడంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు అధికారులు. గ్రామాలు, పట్టణాల్లో వైకుంఠ ధామాలు, మాడ్రన్ దోభీఘాట్లు, నాన్ వెజ్ మార్కెట్లు త్వరగా పూర్తిచేయాలని సూచించనున్నారు సీఎం. 

మరిన్ని వార్తల కోసం

కరీంనగర్​లో నీళ్ల గోస నిజమే

ఖమ్మం ప్రయోగాన్ని రాష్ట్రమంతా అమలుచేస్తాం