హైదరాబాద్ లో బయో అగ్రి సమిట్..

హైదరాబాద్ లో బయో అగ్రి సమిట్..

హైదరాబాద్​, వెలుగు: రసాయనాలు వాడని జీవ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి హైదరాబాద్​లో ఆరో వార్షిక బయో అగ్రి సమిట్​ బుధవారం  మొదలయింది. బయోఅగ్రి ఇన్​పుట్ ​ప్రొడ్యూసర్స్​అసోసియేషన్​(బీఐపీఏ) నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎనిమిదో తేదీన ముగుస్తుంది. 

‘బయోలాజికల్​ ఇంటెలిజెన్స్​, స్మార్ట్ ​అగ్రికల్చర్’​ ముఖ్యాంశంగా నిర్వహిస్తున్న ఈ సదస్సులో 382 మంది సైంటిస్టులు, ఇన్నోవేటర్లు పాల్గొన్నారు. ఇక్కడ 35 స్టాళ్లలో 60కి పైగా ఎగ్జిబిటర్లు తమ ఉత్పత్తులను, సాంకేతికతలు ప్రదర్శిస్తున్నారు. అగ్రి-బయోలాజికల్స్, వ్యాపార అవకాశాలు, సాయిల్ హెల్త్, స్మార్ట్ టెక్నాలజీపై చర్చించారు.