బయో బబుల్‌ను భారత క్రికెటర్లు తట్టుకోగలరు

బయో బబుల్‌ను భారత క్రికెటర్లు తట్టుకోగలరు

కోల్‌కతా: బయో బబుల్ లో ఉండటం కష్టమేనని, కానీ టీమ్ ఇండియా ప్లేయర్లకు సహనం ఎక్కువని బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ అన్నారు. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ మొదలైనప్పటి నుంచి క్రికెటర్లు బయో బబుల్ లో ఉంటున్నారు. హోటళ్ళు, స్టేడియాల్లో ఉంటూ బయటకు రావట్లేదు. ఈ విషయంపై దాదా స్పందించాడు. 'ఓవర్సీస్ ప్లేయర్ ల కంటే మన ఆటగాళ్లకు కాస్త ఓపిక ఎక్కువ. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్ క్రికెటర్ల తో నేను చాలా క్రికెట్ ఆడా. మానసిక ఆరోగ్యం మీద వారికి పెద్దగా ధ్యాస ఉండదు. గత ఆరేడు నెలలుగా బిజీ షెడ్యూల్లతో క్రికెటర్లు బయో బబుల్ లో ఉండటం కఠినమైన అంశం. హోటల్ రూంలో ఉంటూ ఒత్తిడిని తట్టుకోవడం కష్టమే. కానీ అందుకు మానసికంగా మనల్ని మనం స చేసుకోవాలి. ఒత్తిడి అందరి జీవితాల్లోనూ పెద్ద విషయమని అర్థం చేసుకోవాలి' అని దాదా పేర్కొన్నాడు.