కరోనా వ్యాక్సిన్‌ తయారీలోకి బయోలాజికల్‌-ఈ

కరోనా వ్యాక్సిన్‌ తయారీలోకి బయోలాజికల్‌-ఈ

హైదరాబాద్‌, వెలుగు: సేఫ్‌, అఫర్డబుల్‌ కరోనా వ్యాక్సిన్ ను డెవలప్‌ చేసేందుకు యూఎస్‌కు చెందిన బేలర్‌‌ కాలేజి ఆఫ్‌ మెడిషిన్‌(బీసీఎం)తో హైదరాబాద్‌ బేస్డ్‌ ఫార్మా కంపెనీ బయోలాజికల్‌–ఈ లిమిటెడ్‌(బీఈ) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం బీసీఎం డెవలప్‌ చేసిన కరోనా వ్యాక్సిన్ ను పెద్ద మొత్తంలో మాన్యుఫాక్చరిం గ్‌ చేయడానికి బీఈకి వీలుంటుంది. ఈ వ్యాక్సిన్ ను బీఈ మరింతగా డెవలప్‌ చేసి, కమర్షియలైజ్‌ చేయనుంది. అఫర్డబుల్‌ వ్యాక్సిన్ ను డెవలప్‌ చేయడానికి బీసీఎంతో కుదుర్చుకున్న పార్టనర్‌‌షిప్‌ సాయపడుతుందని బీఈ మేనేజింగ్ డైరక్టర్‌‌ మహిమా దాట్ల అన్నారు.

జాన్సన్అండ్జాన్సన్ తోనూ ఒప్పందం..

జాన్సన్‌ అండ్ జాన్సన్‌ డెవలప్‌ చేసిన కరోనా వ్యాక్సిన్ ను మాన్యుఫ్యాక్చరింగ్‌ చేయడానికి ఈ కంపెనీకి చెందిన జాన్సన్‌ ఫార్మాస్యూటికా ఎన్బీ తో బయోలాజికల్-–ఈ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ పై ఫేజ్‌ 1/2 క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి.