
హైదరాబాద్, వెలుగు: బయోలాజికల్ ఈ లిమిటెడ్(బీఈ) సిటీ శివారులోని జెనోమ్ వ్యాలీ వద్ద స్పెషల్ ఎకానమిక్ జోన్‌లో ఏర్పాటు చేసిన ప్లాంట్‌ను ఐటీ, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దీంతో పాటు చిన్నపిల్లలను టైఫాయిడ్ ఫీవర్ నుంచి కాపాడేందుకు కొత్త టైఫాయిడ్ కంజుగేట్ వ్యాక్సిన్(టీసీవీ)ను కూడా లాంచ్ చేశారు. బీఈ ప్లాంట్‌ను విస్తరణను కేటీఆర్ అభినందించారు. లైఫ్ సైన్సెస్‌పై స్పెషల్ ఫోకస్ చేస్తూ… ఇండస్ట్రియల్ గ్రోత్, ఎంప్లాయిమెంట్ జనరేషన్‌లో తెలంగాణను నెంబర్ వన్ రాష్ట్రంగా మార్చేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఇవి తెలంగాణ రాష్ట్ర ఎకానమీకి బూస్టప్ ఇవ్వడమే కాకుండా… ఈ ఇండస్ట్రీస్‌పై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డ చాలా మంది ప్రజల జీవితాలను మెరుగుపర్చనున్నాయని చెప్పారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు రూ.300 కోట్లను బీఈ ఇన్వెస్ట్ చేసిందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల చెప్పారు. 29 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ కమర్షియల్ ప్రొడక్షన్ ప్రారంభించేందుకు సిద్ధమైందన్నారు. ఈ ప్లాంట్ ద్వారా సుమారు వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నామని పేర్కొన్నారు. ఈ కొత్త ఫెసిలిటీ ఇప్పటికే ఉన్న వ్యాక్సిన్ ప్లాంట్ ప్రొడక్షన్ పెంచేందుకు సాయం చేయనుందని, కొత్త ప్రొడక్ట్‌ల తయారీకి ఉపయోగపడనుందని మహిమ తెలిపారు.
మూడు నెలల్లో కమర్షియల్‌గా అందుబాటు…
కొత్త టైఫాయిడ్ కంజుగేట్ వ్యాక్సిన్‌ను మార్కెట్ చేసుకునేందుకు బీఈకి ఇటీవలే హెల్త్ రెగ్యులేటరీ అథారిటీల నుంచి అనుమతి వచ్చింది. టీసీవీను ఆరు నెలల నుంచి చిన్న పిల్లలకు, అడల్డ్స్‌కు సింగిల్ డోస్‌లో ఇవ్వొచ్చు. ఈ వ్యాక్సిన్‌ను ఇటలీలోని జీఎస్‌కే వ్యాక్సిన్స్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ భాగస్వామ్యంలో అభివృద్ధి చేశారు. దీన్ని 2013లో బీఈకి ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆ తర్వాత ఈ వ్యాక్సిన్ డెవలప్‌మెంట్ వర్క్ అంతా బీఈనే చేపట్టింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని బీఈ జీఎంపీ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీలో ఈ వ్యాక్సిన్ తయారీ ప్రారంభమవుతుంది. దీన్ని మూడు నెలల్లో కమర్షియల్‌గా అందుబాటులోకి తేనున్నారు. ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేయడం ద్వారా గ్లోబల్‌గా చాలా మందిని ముఖ్యంగా చిన్న పిల్లలను టైఫాయిడ్ నుంచి కాపాడామని మహిమ తెలిపారు. 2017లోని అంచనాల ప్రకారం, టైఫాయిడ్ ఫీవర్‌తో ప్రపంచవ్యాప్తంగా 1,16,00 మంది చనిపోయారు