నేడు (జూలై 18న) జటప్రోల్‌‌కు సీఎం రేవంత్‌‌రెడ్డి

నేడు (జూలై 18న) జటప్రోల్‌‌కు సీఎం రేవంత్‌‌రెడ్డి
  • యంగ్‌‌ ఇండియా స్కూల్‌‌కు శంకుస్థాపన

నాగర్‌‌కర్నూల్‌‌, వెలుగు : నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లా పెంట్లవెల్లి మండలంలోని జటప్రోల్‌‌ గ్రామానికి శుక్రవారం సీఎం రేవంత్‌‌రెడ్డి రానున్నారు. ఆ గ్రామంలో రూ. 150 కోట్లతో నిర్మించనున్న యంగ్‌‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌‌ స్కూల్‌‌కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలు అందించనున్నారు.

 రాష్ట్రంలో కాంగ్రెస్‌‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్‌‌రెడ్డి తొలిసారి కొల్లాపూర్‌‌కు వస్తున్నందున ప్రోగ్రామ్‌‌ను సక్సెస్‌‌ చేసేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు చర్యలు చేపట్టారు. బహిరంగ సభ కోసం భారీగా జనాన్ని సమీకరించేందుకు ప్లాన్‌‌ చేస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రితో పాటు కలెక్టర్‌‌ బాదావత్‌‌ సంతోష్‌‌ వివిధ శాఖల ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించడంతో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బహిరంగ సభకు ముందుగా సీఎం రేవంత్‌‌రెడ్డి మదనగోపాలస్వామి, శివాలయాన్ని సందర్శించనున్నారు.