చిల్కాకు రెక్కల గెస్టులు

చిల్కాకు రెక్కల గెస్టులు

వలస పక్షులకు అడ్డా ఒడిశాలోని చిల్కా సరస్సు. చలికాలంలో మస్తు పక్షులు వస్తాయక్కడికి. మరి చలికాలమైందిగా. ఈసారీ పలకరించడానికి వచ్చేశాయి. వందల్లో, వేలల్లో కాదు లక్షల్లో. సుమారు 11 లక్షల 5 వేల రెక్కల గెస్టులు సరస్సు దగ్గర ఎంజాయ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నాయి. వీటిల్లో 184 రకాల జాతులున్నాయి. పోయినేడాదితో పోలిస్తే ఈసారి 57 వేల ఎక్కువ పక్షులు వచ్చాయని డివిజనల్‌‌‌‌‌‌‌‌ ఫారెస్టు అధికారి అలోక్‌‌‌‌‌‌‌‌ రంజన్‌‌‌‌‌‌‌‌ హొటా చెప్పారు. ఇందులో 10.71 లక్షల వాటర్‌ఫాల్స్‌‌‌‌‌‌‌‌ ఉన్నాయన్నారు. మొత్తం 1,100 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో పక్షుల సంఖ్యను లెక్కించామని అన్నారు. ఈసారి నలబన ద్వీపం పక్షులకు బాగా నచ్చిందని, మొత్తం పక్షుల్లో 4.06 లక్షలు అక్కడే సేద తీరుతున్నాయన్నారు. 15.59 చదరపు కిలోమీటర్లున్న ఈ ద్వీపాన్ని బర్డ్‌‌‌‌‌‌‌‌ శాంక్చుయరీగా ప్రకటించారు. తర్వాత మంగలజోడిలో 2.42 లక్షలు కనబడ్డాయని అలోక్‌‌‌‌‌‌‌‌ తెలిపారు.

ఐదేళ్లకు గ్రేట్‌‌‌‌‌‌‌‌ నాట్‌‌‌‌‌‌‌‌లు కనవడ్డయ్‌‌‌‌‌‌‌‌

గడ్వాల్‌‌‌‌‌‌‌‌ జాతి పక్షులు ఈసారి బాగా కనబడుతున్నాయని, 11 లక్షల్లో 2.05 లక్షలు ఇవేనని అలోక్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. తర్వాత నార్తర్న్‌ పిన్‌‌‌‌‌‌‌‌టెయిల్‌‌‌‌‌‌‌‌ 1.82 లక్షలు, యురేసియన్‌‌‌‌‌‌‌‌ బిల్‌‌‌‌‌‌‌‌ 1.43 లక్షలు ఉన్నాయని వెల్లడించారు. సెంట్రల్‌‌‌‌‌‌‌‌ ఆసియాకు చెందిన రెండు గ్రేట్‌‌‌‌‌‌‌‌ నాట్‌‌‌‌‌‌‌‌ పక్షులు 2015 తర్వాత మళ్లీ ఇప్పుడు కనిపించాయని అధికారులు చెప్పారు. ఫణి సైక్లోన్‌‌‌‌‌‌‌‌ వల్ల సరస్సుకు నష్టం జరిగినా పక్షుల రాకకు ఇదేం అడ్డుకాలేదని పక్షి ప్రేమికులన్నారు. కాగా, పశ్చిమ బెంగాల్‌‌‌‌‌‌‌‌లోని అలిపుర్దువార్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ఉన్న బక్సా నేషనల్‌‌‌‌‌‌‌‌ పార్కులో బక్సా బర్డ్‌‌‌‌‌‌‌‌ ఫెస్టివల్‌‌‌‌‌‌‌‌ సోమవారం మొదలైంది. 4 రోజుల పాటు జరిగే ఈ పండుగను చూసేందుకు సుమారు 50 మందికి పైగా బర్డ్‌‌‌‌‌‌‌‌వాచర్లు రిజిస్టర్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నారు. వీళ్లలో విదేశీయులు కూడా ఉన్నారు. గ్రేట్‌‌‌‌‌‌‌‌ హార్న్‌‌‌‌‌‌‌‌బిల్‌‌‌‌‌‌‌‌, సుల్తాన్‌‌‌‌‌‌‌‌ టిట్‌‌‌‌‌‌‌‌, గ్రేటర్‌‌‌‌‌‌‌‌ స్పాటెడ్‌‌‌‌‌‌‌‌ ఈగల్‌‌‌‌‌‌‌‌ సహా 300 రకాల పక్షులు వస్తుంటాయట.