బీఆర్ఎస్ను బంగాళాఖాతంలో కలపాలి : బీర్ల అయిలయ్య

బీఆర్ఎస్ను బంగాళాఖాతంలో కలపాలి : బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు :  పదేళ్లుగా రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న బీఆర్ఎస్‌‌‌‌ను బంగాళాఖాతంలో కలపాలని కాంగ్రెస్ ఆలేరు క్యాండిడేట్ బీర్ల అయిలయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం గుండాల మండలం పెద్దపడిశాల, గంగాపురం, యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లి, బొమ్మలరామారం మండలం తూంకుంట, చీకటిమామిడి, రాజాపేట మండలం రేణిగుంట, తుర్కపల్లి మండలం మల్కాపురం, ఆత్మకూర్ మండలం తుక్కాపురం గ్రామాలకు చెందిన 500 మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్‌‌‌‌లో చేరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించి కాంగ్రెస్ మిగులు బడ్జెట్ తో రాష్ట్రాన్నిస్తే.. సీఎం కేసీఆర్ పదేళ్లలో అప్పులపాలు చేశారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రజల సొమ్మును లూటీ చేసి.. కల్వకుంట్ల కుటుంబ సభ్యుల జేబులను నింపారని ఆరోపించారు.  ఈ కార్యక్రమంలో నేతలు గుండు నర్సింహ్మ గౌడ్,  దేవేందర్, నల్లమాస ఆంజనేయులు  ఉన్నారు.