రేవంత్ రెడ్డిని కలిసిన బీర్ల అయిలయ్య

రేవంత్ రెడ్డిని కలిసిన బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు: కాంగ్రెస్‌ ఆలేరు అభ్యర్థి బీర్ల అయిలయ్య శుక్రవారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు.  ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ ను అనుకూలంగా వస్తున్న నేపథ్యంలో  హైదరాబాద్‌లోని రేవంత్ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. యాదగిరిగుట్ట లడ్డూప్రసాదాన్ని అందజేసి శాలువాతో సన్మానించారు. అనంతరం ఆలేరులో పోలింగ్ సరళిపై  రేవంత్ రెడ్డితో కాసేపు చర్చలు జరిపారు.  ఈ నెల 3న వెలువడే ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా రాబోతున్నాయని, ఎవరూ అధైర్య పడొద్దని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు బీర్ల అయిలయ్య తెలిపారు.  

ఆయన వెంట  డీసీసీ ప్రెసిడెంట్ అండెం సంజీవరెడ్డి, యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం,  పట్టణ మాజీ అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్ గౌడ్,  నాయకులు దుంబాల వెంకట్ రెడ్డి, శిఖ ఉపేందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడిపాటి మధుసూదన్ రెడ్డి,  ముక్కెర్ల మల్లేశ్ యాదవ్, ఉప్పలయ్య గౌడ్  ఉన్నారు.