పిల్లలు పుట్టుకకు.. స్మార్ట్ఫోన్కు ఏంటి సంబంధం..? రేడియేషన్ ఒక్కటే కారణం కాదు.. ఈ రిపోర్ట్ గురించి తెలుసుకోండి

పిల్లలు పుట్టుకకు.. స్మార్ట్ఫోన్కు ఏంటి సంబంధం..? రేడియేషన్ ఒక్కటే కారణం కాదు.. ఈ రిపోర్ట్ గురించి తెలుసుకోండి

కొత్తగా పెళ్లి చేసుకున్న జంటకు తొందరగా పేరెంట్స్ అయిపోవాలనే కలలు ఉండటం సహజం.. అమ్మ, నాన్న అనిపించుకోవాలని చాలా మంది ఉవ్విళ్లూరుతుంటారు. కానీ పిల్లలు కాకపోవడంతో గైనకాలజిస్టుల చుట్టూ.. ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరగటం పరిపాటి అయిపోతుంటుంది. ఇది ఒక్క ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ సమస్య వెనుక ఎన్నో కారణాలున్నా.. స్మార్ట్ ఫోనే ప్రధాన కారణంగా మారుతోందని సైంటిస్టులు చెబుతున్నారు. 

ప్రపంచ వ్యాప్తంగా ఒక మహిళకు కలుగుతున్న పిల్లలు సరాసరిగా ఒకరు లేదా ఇద్దరు మాత్రమేనట. రీసెంట్  స్టడీస్ లో ఈ విషయం వెల్లడైంది. కొన్ని ప్రాంతాలో అసలు పిల్లలే పుట్టడం లేదట.

లేటు వయసులో పెళ్లిళ్లు, ఫెర్టిలిటీ సమస్యలు, లివింగ్ కాస్ట్ పెరగటం, కెరీర్ ప్రెజర్స్, సామాజిక పద్ధతులు మారుతుండటం.. ఇలాంటి కారణాల వలన పిల్లలు కలగటం లేదని ఇన్నాళ్లు ఒక అభిప్రాయం ఉండేది. కానీ ప్రస్తుతం స్మార్ట్ ఫోన్, డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ముఖ్యకారణంగా పరిశోధకులు చెబుతున్నారు. 

సిన్సినిటీ యూనివర్సిటీకి చెందిన నాథన్ హడ్సన్, హెర్నన్ మోస్కోబో అనే పరిశోధకులు అమెరికా, యూకేలో నిర్వహించిన రీసెర్చ్ లో ఈ విషయాన్ని కనుగొన్నారు. హై స్పీడ్ మొబైల్ కనెక్టివిటీ ఉన్న ఏరియాల్లో జననాల రేటు దారుణంగా పడిపోతున్నట్లు పరిశోధన ద్వారా వెల్లడించారు. 

  • రేడియేషన్ ఒక్కటే కారణం కాదు:

జనరల్ గా ఫోన్ వినియోగం వలన పిల్లలు కలగటం లేదంటే.. ఇంకేముంటుంది రేడియేషన్ ఎఫెక్ట్ అనుకుంటుంటారు అందరు. కానీ.. అదొక్కటే కాదని చెబుతున్నారు పరిశోధకులు. స్మార్ట్ ఫోన్ వినియోగం ప్రాథమికంగా యవతలో చాలా మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా.. పూర్తిగా ఆన్ లైన్ కు షిఫ్ట్ కావడం, ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ కావడం మొదలైనవి పూర్తిగా తగ్గిపోయయాయి. స్టడీ ప్రకారం.. వ్యక్తుల ఇంటరాక్షన్ తగ్గిపోవడం ఫెర్టిలిటీ రేటు పడిపోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందంట. ముఖ్యంగా 2000 నుంచి 2007 వరకు బర్త్ రేట్స్ బాగానే ఉన్నాయని.. ఆ తర్వాత స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగే కొలది తగ్గుతూ వస్తున్నాయని స్టడీ పేర్కొంది. 

  • బంధాలపై ప్రభావం.. బర్త్ రేటు తగ్గుదల:

సోషల్ మీడియా వినియోగం బంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోందట. ముఖ్యంగా భార్యభర్తల మధ్య ఉండే అన్యోన్యత సోషల్  మీడియా కారణంగా దెబ్బతింటుందట. కపుల్స్ మధ్య సెక్సువల్ గా తీవ్ర ప్రభావం చూపిస్తోందని రీసర్చర్లు పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా కారణంగా భార్యభర్తల మధ్య శారీరకంగా, మానసికంగా దూరం పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే అంశం. కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నా.. ఎక్కువ సేపు విడిగానే ఉంటున్నామనే విషయం గమనించాలని చెబుతున్నారు. 

పాట్నర్ కు ఇవ్వాల్సిన సమయాన్ని స్మార్ట్ ఫోన్ కు ఇవ్వడం కారణంగా.. శరీరంలో బయాలజికల్ హార్మోన్స్ పై తీవ్ర ప్రభావం చూపిస్తోందని చెబుతున్నారు. ఈ కారణంగా శృంగారంపై ఆసక్తి తగ్గిపోవడం.. దీంతో ఫెర్టిలిటీ సమస్యలు మొదలవ్వటం.. ఇలా ఒకదానికి ఒకటి లింక్ అవ్వడంతో పిల్లలు పుట్టే శాతం ప్రపంచవ్యాప్తంగా పడిపోతుందని పరిశధనలో తేలింది.