రోడ్డుపై పుట్టినరోజు వేడుకలు.. ఒకరు మృతి

రోడ్డుపై పుట్టినరోజు వేడుకలు.. ఒకరు మృతి

కరీంనగర్: పుట్టినరోజు వేడుకల్లో విషాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి ఓ స్నేహ బృందం రోడ్డుపై సెలబ్రేషన్స్ చేసుకుంటుండగా ఆ సమయంలో అటుగా వచ్చిన లారీ వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పుట్టినరోజు జరుపుకుంటున్న ఎనగందుల అరుణ్ (23) మరణించాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరిలో జరిగింది. స్నేహితులతో కలసి అరుణ్ కేక్ కట్ చేస్తుండగా లారీ వారిని ఢీకొట్టింది. అరుణ్ అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల అదుపులో లారీ, లారీ డ్రైవర్ ఉన్నట్లు సమాచారం.