వరదల ఎఫెక్ట్... కొట్టుకుపోయిన ఖాళీ బిర్యానీ హండీ

వరదల ఎఫెక్ట్... కొట్టుకుపోయిన ఖాళీ బిర్యానీ హండీ

రాష్ట్రంలో కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరి, కొన్ని ప్రాంతాల్లో నివాస ప్రాంతాలు సైతం చెరువులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ సంఘటన అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటి వరకూ రోడ్లు, ఇంట్లోని సామాన్లు, ఇతర వాహనాలు కొట్టుకోవడం మాత్రమే చూశాం. కానీ ఈ సారి వరదలో కొట్టుకుపోతున్న బిర్యానీ హండీకి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హైదరాబాద్ లోని ఓ రెస్టారెంట్ కు చెందిన ఓ ఖాళీ బిర్యానీ హండీ వరదనీటిలో కొట్టుకుపోయింది. బిర్యానీ హండీ, దానిపై ఉన్న మరో పాత్ర కూడా వరదనీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాలను వీడియో తీసి కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ప్రస్తుతం అది నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో ఈ వీడియోపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. ఫాస్ట్ డెలివరీ అంటే ఇదేనా అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే  వీడియో పోస్ట్ చేసిన ట్విట్ట్ లో హైదరాబాద్ హ్యాష్ ట్యాగ్ ఉంది. కానీ ఈ ఘటన హైదరాబాద్ లో ఎక్కడ జరిగిందన్న విషయం మాత్రం తెలియలేదు.