Biryani Samosa : బిర్యానీ సమోసా ఏంట్రా నాయనా.. 

Biryani Samosa  : బిర్యానీ సమోసా ఏంట్రా నాయనా.. 

సమోస అంటే ఆలూ సమోస.. కార్న్ సమోస.. ఆనియన్ సమోస లాంటివి గుర్తుకొస్తాయి.. ఇవన్నీ పూర్తిగా వెజిటేరియన్.. ఈనింగ్ స్నాక్స్ గా సమోస అనేది తరాలుగా వస్తూ ఉంది. ఎన్ని రకాలుగా సమోస టేస్ట్ మారినా.. వివిధ రుచుల్లో వచ్చినా సమోస అంటే ఆలూ సమోసగానే ఫేమస్.. ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న కొత్త రకం సమోస ఏంటో తెలుసా.. బిర్యానీ సమోస.. ఎస్.. మీరు విన్నది నిజమే.. బిర్యానీ సమోస ఇప్పుడు ఫుడీస్ ను ఎట్రాక్ట్ చేస్తుంది. కొత్త కొత్త ఐడియాకు కొదవ లేదని నిరూపిస్తుంది.. ఇంతకీ బిర్యానీ సమోస ఎలా చేస్తారు.. ఎలా ఉంటుంది అనేది చూద్దామా...

సమోస కోసం రెగ్యులర్ గా పిండితో తయారు చేసే కప్ ఉంటుంది కదా.. అందులో కొంచెం వండిన బిర్యానీ రైస్ తోపాటు.. ఓ చిన్న చికెన్ ముక్క.. అది కూడా బోన్ లెస్ వేస్తారన్న మాట.. దాన్ని ఎప్పటి లాగే నూనెలో వేయిస్తారు.. అంతే బిర్యానీ సమోస రెడీ.. ఓ ముద్ద బిర్యానీ నోట్లో పెట్టుకున్నట్లే.. సమోసలో బిర్యానీని తింటాం అన్న మాట.. 

దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. సమోస, బిర్యానీ రెండూ వేర్వేరు కాంబినేషన్ అని.. వేర్వేరు టేస్ట్ అని.. వాటికి ఉన్న విలువను పాడుచేయొద్దని చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అయితే సమోస అనేది స్నాక్స్ కింద తీసుకుంటామని.. బిర్యానీ అనేది లంచ్ లేదా డిన్నర్ లో తీసుకునేది.. రెండింటినీ కలిపి వాటి ఎమోషన్ ను చెడగొట్టద్దంటూ సూచనలు ఇస్తున్నారు. బిర్యానీ సమోసతో సమోసకు శ్రద్దాంజలి అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..మరికొందరు అయితే బిర్యానీ సమోస ఏంట్రా నాయనా.. అంటూ నెగెటివ్ ట్విట్స్ వేస్తున్నారు.. 

ఎవరి ఎమోషన్స్ ఎలా ఉన్నా.. ఫుడీస్ మాత్రం డిఫరెంట్ ఐడియా.. టేస్ట్ ఎలా ఉంటుందో అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ కొత్త రకం వంటకం ఎంత వరకు వెళుతుందో చూడాలి...