ఎలక్ట్రికల్ యాక్సెసరీలకు బీఐఎస్​ గుర్తింపు​ తప్పనిసరి

ఎలక్ట్రికల్ యాక్సెసరీలకు బీఐఎస్​ గుర్తింపు​ తప్పనిసరి

న్యూఢిల్లీ :  నాణ్యత లేని వస్తువుల దిగుమతిని అరికట్టడానికి,  దేశీయ తయారీని పెంచడానికి ప్రభుత్వం స్విచ్- సాకెట్- ఔట్‌‌‌‌‌‌‌‌లెట్లు,  కేబుల్ ట్రంక్ వంటి ఎలక్ట్రికల్ వస్తువులకు తప్పనిసరి నాణ్యత నిబంధనలను జారీ చేసింది. ఎలక్ట్రికల్ యాక్సెసరీస్ (క్వాలిటీ కంట్రోల్) ఆర్డర్, 2023ని ఈ ఏడాది జనవరి 1న డిపార్ట్​మెంట్​ ఫర్​ ప్రమోషన్​ ఆఫ్​ ఇండస్ట్రీ అండ్​ ఇంటర్నల్​ ట్రేడ్​ (డీపీఐఐటీ) జారీ చేసింది. ఈ ఆర్డర్ ప్రకారం ఎలక్ట్రిక్​ వస్తువులకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్​) గుర్తు తప్పకుండా ఉండాలి. లేకపోతే వాటిని ఉత్పత్తి చేయడం, విక్రయించడం, వ్యాపారం చేయడం, దిగుమతి చేయడం,  నిల్వ చేయడం సాధ్యం కాదు.

నోటిఫికేషన్ వెలువడిన ఆరు నెలల నుంచి ఈ ఆర్డర్ అమల్లోకి వస్తుందని డీపీఐఐటీ తెలిపింది.  ఎంఎస్​ఎంఈ రంగాన్ని రక్షించడానికి కొన్ని సడలింపులను ఇచ్చారు. చిన్న పరిశ్రమలకు అదనంగా తొమ్మిది నెలలు, మైక్రో ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌‌‌‌‌కు 12 నెలలు అదనంగా ఇస్తారు. బీఐఎస్​ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తే, మొదటి నేరానికి గరిష్టంగా రెండేళ్ల జైలుశిక్ష లేదా కనీసం రూ. 2 లక్షల జరిమానా విధించవచ్చు. రెండవ,  తదుపరి నేరాల విషయంలో మరింత కఠిన శిక్షలు ఉంటాయి.