జీవ వైవిధ్యం .. బిట్​ బ్యాంక్​

జీవ వైవిధ్యం .. బిట్​ బ్యాంక్​

   భారతదేశ జీవ వైవిధ్య చట్టం అమలుకు ఏర్పాటైన నేషనల్​ బయో డైవర్సిటీ అథారిటీ ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. 

    ఒక ఆవరణ వ్యవస్థలోని జాతి వైవిధ్యాన్ని ఆల్ఫా వైవిధ్యం అంటారు. 

    ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 36 బయోడైవర్సిటీ హాట్​స్పాట్లను గుర్తించారు. 

    దేశంలో జీవ వైవిధ్య చట్టం 2002లో అమల్లోకి వచ్చింది. వైల్డ్​ లైఫ్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా ప్రధాన కార్యాలయం డెహ్రాడూన్​లో ఉంది. 

    దేశంలో అత్యధిక సంఖ్యలో ఆసియా సింహాలు గుజరాత్​లోని గిర్​ అడవుల్లో సంరక్షించబడుతున్నాయి. 

    సిక్కిం రాష్ట్ర జంతువు రెడ్​ పాండా. 

    వన్యజీవుల పరిరక్షణకు లాబొరేటరీ ఫర్​ ది కన్జర్వేషన్​ ఆఫ్​ ఎండేంజర్డ్​ స్పీషీస్​ హైదరాబాద్​లో ఉంది. 

    అంతర్జాతీయ జీవవైవిధ్య సంరక్షణ ఒప్పందానికి సంబంధించిన 14వ సదస్సు 2018లో ఈజిప్టులోని షర్మ్​ – ఎల్​ – షేక్​లో ఉంది. 

    తిమింగలాల, డాల్ఫిన్ల వేటను నియంత్రించే ఉద్దేశంతో ఏర్పాటైన ఇంటర్నేషనల్​ వేలింగ్​ కమిషన్​ ప్రధాన కార్యాలయం కేంబ్రిడ్జ్​లో ఉంది. 

    ఎక్స్​ సిటు జీవవైవిధ్య సంరక్షణ పద్ధతికి ఉదాహరణ కణజాల వర్థనం, జంతు ప్రదర్శనశాలలు, గ్రీన్​ హౌస్​. 

    కడలుండి కమ్యూనిటీ రిజర్వు కేరళలో ఉంది. 

    రెడ్​ పాండా, పెద్దపులి, ఢోల్​ను ఎండేంజర్డ్​ జాతుల్లో భాగంగా గుర్తించబడింది. 

    మెగా బయోడైవర్సిటీ దేశంగా గుర్తింపు పొందిన దేశం అర్జెంటీనా. 

    పులుల సంరక్షణకు దేశాన్ని ఏడు భాగాలుగా భారత్​ విభజించింది. 

    నేషనల్​ బ్యూరో ఆఫ్​ యానిమల్​ జెనిటిక్​ రిసోర్సెస్​ కర్నల్​ ఉంది. 

    స్పిషీస్​ రికవరీ ప్రోగ్రాంలో భాగంగా ప్రత్యేక సంరక్షణలో ఉన్న జంతు జాతులు బెంగాల్​ పులి, సాంగైదుప్పి, బట్టమేక పక్షి. 

    డీపోర్​ బీల్​ చిత్తడి నేల అసోంలో ఉంది. 

    ప్రపంచంలో మొత్తం 17 మెగా బయోడైవర్సిటీ కేంద్రాలను ఇప్పటివరకు గుర్తించారు. 

    ఇంటర్నేషనల్​ యూనియన్​ ఫర్​ కన్జర్వేషన్​ ఆఫ్​ నేచర్​ అండ్​ నేచురల్​ రిసోర్సెస్​ (ఐయూసీఎన్​) ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. 

    భారత్​లో మొదటిసారిగా 1936లో ఏర్పరచిన తొలి కార్బెట్​ జాతీయ పార్కును హెయిలీ జాతీయ పార్కు. 

    వైల్డ్​ లైఫ్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా డెహ్రాడూన్​లో ఉంది. 

    ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిత్తడి నేలల సంరక్షణ కోసం ఏర్పడిన అంతర్జాతీయ ఒప్పందం రామ్సర్​ కన్వెన్షన్​. 

    1973, ఏప్రిల్​ 1న పులుల సంరక్షణకు ఉద్దేశించిన ప్రాజెక్టు టైగర్​ ప్రారంభమైంది. 

    రాయల్​ బెంగాల్​ టైగర్ శాస్త్రీయ నామం పాంథెరా టైగ్రిస్​. 

    నేషనల్​ టైగర్ కన్జర్వేషన్​ అథారిటీ ప్రధాన మంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. 

    వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972లో అమల్లోకి వచ్చింది. 

    మధ్యప్రదేశ్​ రాష్ట్రంలో అత్యధిక టైగర్​ రిజర్వులను ఏర్పాటు చేశారు. 

    దేశంలోని హిమాలయాల్లో రెడ్​పాండా కనిపిస్తుంది. 

    తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో కవాల్​ టైగర్​ రిజర్వ్​ ఏర్పాటైంది. 

    ప్రపంచంలో అత్యధిక జీవవైవిధ్యం  ఉన్న దేశం ఆస్ట్రేలియా. 

    కాంచనజంగా బయోస్పియర్​ రిజర్వు సిక్కిం రాష్ట్రంలో ఉంది. 

    పిన్​వ్యాలీ నేషనల్​ పార్కు హిమాచల్​ప్రదేశ్​ రాష్ట్రంలో ఉంది. 

    ఆసియా సింహం సంరక్షిత ప్రాంతం గిర్​ అడవులు. 

    కేరళ రాష్ట్ర జంతువు ఏనుగు.

    ఇడుక్కి అభయారణ్యం కేరళ రాష్ట్రంలో ఉంది. 

    గ్రేట్​ హార్న్​బిల్​ అనేది కేరళ రాష్ట్రానికి చెందిన రాష్ట్రీయ పక్షి.

    యునైటెడ్​ నేషన్స్​ ఎన్విరాన్​మెంట్​ ప్రోగ్రాం (యూఎన్​ఈపీ) ప్రధాన కార్యాలయం నైరోబీలో ఉంది. 

    దేశంలో అంతరించే ప్రమాదమున్న జంతువుల పరిరక్షణకు ఉద్దేశించిన ప్రయోగశాల లేబొరేటరీ ఫర్​ ద కన్జర్వేషన్​ ఆఫ్​ ఎండేంజర్డ్​ స్పిషీస్​ను హైదరాబాద్​లో ఏర్పాటు చేశారు. 

    భారత్​లో మొత్తం 54 టైగర్ రిజర్వులను ఏర్పాటు చేశారు. 

    కనీసం 70శాతం ఆవాసాన్ని కోల్పోయి 1500 ఎండమిక్​ ఆవృతబీజ జాతులున్న భౌగోళిక ప్రాంతాలను బయోడైవర్సిటీ హాట్​స్పాట్​ అంటారు. 

    వరల్డ్​ ఎర్త్​ డే ఏప్రిల్​ 22న జరుపుకుంటారు. 

    భారత్​లో ఉభయచర జీవుల వైవిధ్యం అధికంగా పశ్చిమ కనుమలులో ఉంది.