ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (PJTU) రూరల్ కో–ఆర్డినేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. నవంబర్ 21న వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.
పోస్టుల సంఖ్య: 02 (రూరల్ కో–ఆర్డినేటర్ జగిత్యాల, తాండూర్).
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అగ్రికల్చరల్, అనుబంధ సైన్స్ గ్రూపుల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 30 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ: నవంబర్ 21.
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.pjtau.edu.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
