కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD) ఆఫీసర్ గ్రేడ్ ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
పోస్టుల సంఖ్య: 91.
పోస్టులు: అసిస్టెంట్ మేనేజర్ (రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీస్– ఆర్బీడీఎస్) 85, అసిస్టెంట్ మేనేజర్ (లీగల్ సర్వీస్) 02, అసిస్టెంట్ మేనేజర్ (ప్రొటోకాల్ అండ్ సెక్యూరిటీ సర్వీస్) 04.
ఎలిజిబిలిటీ
అసిస్టెంట్ మేనేజర్ ( ఆర్ బీడీఎస్): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. లేదా ఏదైనా మాస్టర్స్ డిగ్రీ/ సీఏ/ సీఎస్/ ఐసీఏఐ/ మేనేజ్మెంట్లో డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అసిస్టెంట్ మేనేజర్ (లీగల్ సర్వీస్): కనీసం 60 శాతం మార్కులతో లా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 55 శాతం మార్కులు సాధించి ఉండాలి.
అసిస్టెంట్ మేనేజర్ (ప్రొటోకాల్ అండ్ సెక్యూరిటీ సర్వీస్): ఆర్మీ, నేవీ లేదా ఎయిర్ ఫోర్సులో కనీసం 5 సంవత్సరాలు సర్వీస్ కలిగిన కమిషన్డ్ ఆఫీసర్ అయి ఉండాలి.
వయోపరిమితి: 21 నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 08.
లాస్ట్ డేట్: నవంబర్ 30.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.150. ఇతరులకు రూ.850.
సెలక్షన్ ప్రాసెస్: ప్రిలిమ్స్, మెయిన్స్, సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.nabard.org వెబ్ సైట్ లో సంప్రదించగలరు.
