బిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 18 నెలల గరిష్టానికి

బిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 18 నెలల గరిష్టానికి

బిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 18 నెలల గరిష్టానికి
35 వేల డాలర్లను క్రాస్ చేసిన క్రిప్టో
త్వరలో బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాక్ బిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాయిన్ ఈటీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్తుందని అంచనా

న్యూఢిల్లీ: కొన్నేళ్ల కనిష్టాలకు పడిపోయి తిరిగి పుంజుకుంటున్న క్రిప్టో కరెన్సీ బిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాయిన్ తాజాగా 35 వేల డాలర్ల మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను క్రాస్ చేసింది.   ఎక్స్చేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రేడెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్తుందనే అంచనాలతో ఈ క్రిప్టో కరెన్సీ మంగళవారం 18 నెలల గరిష్టాన్ని టచ్ చేసింది. బిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాయిన్ 6 శాతం పెరిగి 35,198 డాలర్లకు చేరుకుంది.  కిందటేడాది మే తర్వాత ఇదే హయ్యెస్ట్ లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. 

ఈ  క్రిప్టో సోమవారం 10 శాతం ర్యాలీ చేసింది. కాయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బేస్ డేటా ప్రకారం, గత 24 గంటల నుంచి  బిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో భారీగా షార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కవరింగ్ (కొనుగోళ్లు) జరుగుతున్నాయి.  క్రిప్టో కంపెనీలైన కాయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బేస్ గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మైక్రోస్ట్రాటజీల షేర్లు దూసుకుపోతున్నాయి. మరోవైపు క్రిప్టో కరెన్సీ ఎథర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1,800 డాలర్లను టచ్ చేసింది.  బిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎక్స్చేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రేడెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుబాటులోకి వస్తే  ఈ క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసేవారి సంఖ్య పెరుగుతుంది.  ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కంపెనీ బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సహా పలు సంస్థలు బిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాయిన్ ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీసుకురావడానికి  అప్లయ్ చేసుకున్నాయి.

 యూఎస్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెగ్యులేటరీ బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు త్వరలోనే అనుమతులు ఇస్తుందని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. గ్రోస్కేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈటీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్లికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కూడా యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  సెక్యూరిటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ ఎక్స్చేంజ్ కమీషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రతికూలంగా స్పందించలేదు. బిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాయిన్ ఈటీఎఫ్​ వస్తే లిక్విడిటీ పెరుగుతుందని సాక్సో సీఐఓ  స్టీన్ జాకబ్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు.  డీటీసీసీ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాక్ ఐషేర్స్ ఈటీఎఫ్ ఎప్పుడు లిస్ట్ అయిందో,  ఎందుకు అయ్యిందో క్లారిటీ లేదని వెల్లడించారు.