ఇరిగేషన్ ​ఆఫీసర్లను నిర్బంధించిన రైతులు

ఇరిగేషన్ ​ఆఫీసర్లను నిర్బంధించిన రైతులు
  • తమకు చెప్పకుండా సర్వే ఎలా చేస్తారని ఫైర్​ 
  • భూములు ఇచ్చేది లేదన్న చిన్నచింతకుంట వాసులు 

నర్సాపూర్, వెలుగు: మెదక్​ జిల్లా నర్సాపూర్ మండలంలోని చిన్నచింత కుంట గ్రామంలో కొండపోచమ్మ, సంగారెడ్డి కెనాల్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న  రైతుల పొలాల్లో బోర్లు, చెట్లు, ఇతర నిర్మాణాల వివరాలను సేకరించేందుకు మంగళవారం ఇరిగేషన్​ ఆఫీసర్లు వచ్చారు. అయితే, తమకు చెప్పకుండా వచ్చి భూముల్లో సర్వే ఎలా చేస్తారంటూ రైతులు ఇరిగేషన్ ​ఆఫీసర్లపై మండిపడడంతో పాటు, వారిని గ్రామ పంచాయతీ ఆఫీసులో నిర్బంధించారు. కాల్వలు వస్తే తమకు ఉపయోగం లేదని, ప్రాణాలు పోయినా భూమి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. సర్వే చేయం అని ఆఫీసర్లు చెప్పడంతో వదిలిపెట్టారు.