‘తేరే నామ్’ సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన భూమిక ఓవర్‌నైట్ స్టార్‌గా మారింది. కానీ, అక్కడ స్టార్ స్టేటస్‌ను అందుకోలేకపోయింది. తాజాగా తనకు బీటౌన్లో ఎదురైన చేదు అనుభవాన్ని వివరించింది. జబ్ వి మెట్, మున్నాభాయి ఎంబీబీఎస్ సినిమాలకు మొదట తననే ఎంపిక చేసుకున్నారని చెప్పింది.
వివిధ కారణాల వల్ల తన ప్లేస్‌లో కరీనా కపూర్, సోనాలీ బింద్రేను తీసుకున్నారట. ఈ సినిమాల కోసం ఏడాది పాటు ఎదురుచూశానని... ఆ తర్వాత వేరే సినిమాలు చేసిన తేరేనామ్ వంటి సక్సెస్ రాలేదంది. కెరీర్ పరంగా ఈ సంఘటనలు తనను చాలా బాధించాయని తెలిపింది. ఇటీవల విడుదలైన సల్మాన్ ‘కిసీకా భాయ్ కిసీకీ జాన్’లో భూమిక కీలక పాత్ర పోషించింది.