కొత్తగా ఏంటిది : చెన్నై బీచ్ లో.. టోర్నడో తరహాలో ఇసుక సుడిగాలి

కొత్తగా ఏంటిది : చెన్నై బీచ్ లో.. టోర్నడో తరహాలో ఇసుక సుడిగాలి

చెన్నై మెరీనా బీచ్ లో సోమవారం ( అక్టోబర్ 16) రాత్రి 10 గంటల ప్రాంతంలో  డస్ట్ డెవిల్ ఏర్పడింది.  డస్ట్ డెవిల్అంటే అనేది బలమైన సుడిగాలి ఇసుక బీచ్ లో సంభవించింది. దీంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. కొంతమంది ఈ వీడియోలను సోషల్ మీడియాలో  పోస్ట్ చేశారు. 

 ఈ వీడియోల్లో ఇసుక సుడిగాలి వృత్తాకార కదలికల్లో పొడవుగా.. నిలువైన వరుసలు ఉన్నట్లు స్పష్టంగా కనిసిస్తుంది.   సాధారణంగా ఈ  డస్ట్ డెవిల్స్ చాలా  అరుదైన సందర్భాల్లో ఏర్పడుతుంది.  ఇది ప్రమాదకరం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  డస్ట్ డెవిల్ ఏర్పడినప్పుడు ఈ ప్రాంతంలోని షాపులు, దుకాణాలు మూసివేశారు.  ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. అయితే ఈ ఘటనలో పెద్దగా నష్టం జరగలేదని స్థానిక నివేదికల ప్రకారం తెలుస్తోంది.

రెండు నిమిషాలపాటు కొనసాగిన ఈ భయంకరమైన వీడియోలను పోస్ట్ చేశారు,

డస్ట్ డెవిల్ ను కొంతమంది మినీ సైక్లోన్ అని ఊహించినట్లు వార్తలొస్తున్నాయి.  చెన్నై మెరీనా బీచ్ లో సోమవారం (అక్టోబర్16)న వాతావరణంలో సంభవించిన మార్పులు సహజ వాతావరణానికి సాక్ష్యమిచ్చిందని పర్యావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు.  ఇది తుఫాన్ కాదంటూ.. వాతావరణంలో సహజంగా సంభవించే మార్పులేనని  ఇలా బలమైన గాలి వచ్చినప్పుడు డస్ట్ డెవిల్ అంటారని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది గతంలో కూడా చాలా సార్లు పగటి వేళలలో  వచ్చిందని  ..ఆ సమయంలో దీనిని ఎవరూ గమనించి ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు.