ఈ గ్ర‌హంలో ఉండాల్సినోళ్లే .. రాళ్ల‌తో చేసిన ఫుడ్ తింటున్న చైనీయులు..

ఈ గ్ర‌హంలో ఉండాల్సినోళ్లే .. రాళ్ల‌తో చేసిన ఫుడ్ తింటున్న చైనీయులు..

మీ జీవితకాలంలో ఇప్పటివరకు మీరు ప్రయత్నించని లేదా వినని విచిత్రమైన వంటకం ఏదైనా ఉందా? ఇటీవల ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన ఓ విచిత్రమైన ఫుడ్ ఫ్యూజన్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. చైనాకు చెందిన ఈ వీడియోలో ఫుడ్ ను ప్రిపేర్ చేయడానికి అందులో ఏం ఉపయోగించారో తెలుసా.. గులకరాళ్లు. అవును మీరు వింటున్నది నిజమే..

Хотите похудеть к лету, предлагаю прекрасный рецепт! Камушек пососали и через пару недель, Вас уже ветром с ног сбивать будет? Самая твердая еда в мире? Жареные камни - уличная еда в Китае. pic.twitter.com/K3bne6lHse

— Irina (@notfarmerwife) June 26, 2023

 

సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ స్ట్రీట్ ఫుడ్.. ఇంటర్నెట్‌లో అందర్నీ వెర్రివాళ్లను చేస్తోంది. ఈ రెసిపీ వీడియోలో ఒక చెఫ్ గులకరాళ్లకు కొన్ని ఆహార పదార్థాలను జోడించి వేడిగా వడ్డిస్తున్నట్లు చూపించారు. సుయోడియు అని ప్రసిద్ధి చెందిన ఈ వంటకంలో మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలతో పాటు నది రాళ్లను ప్రాథమిక పదార్ధంగా కలిగి ఉంటాయి. ప్రస్తుతం దీన్ని అందరూ "ప్రపంచంలోని కష్టతరమైన వంటకం" అని పిలుస్తున్నారు.

వైరల్ చైనీస్ వంటకం గురించి..

వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉన్న చైనాలోని ఈ సుయోడియు కొత్త వంటకం కాదు. పడవ నడిపేవారు నది మధ్యలో చిక్కుకుపోయినప్పుడు, సరుకులను పంపిణీ చేస్తున్నప్పుడు ఆహారం అయిపోయినప్పుడు, కొన్ని నది రాళ్లను సేకరించి ఆకలిని తగ్గించుకోవడానికి ఆహార తయారీలో ఉపయోగిస్తారు.  

అసలు దీన్ని మనుషులు తింటారా?

నివేదికల ప్రకారం, రాళ్లను పీల్చి, రుచి చూసి, ఆ తర్వాత విసిరేస్తారు. వీటిని అందరూ అనుకున్నట్టు కొరికి తినరు. మసాలా దినుసులతో పాటు కొంచెం గ్రేవీని కలిగి ఉన్న ఆహార వంటకాన్ని ఆస్వాదిస్తారు అంతే.

https://twitter.com/notfarmerwife/status/1673287260278755328