
బీజేపీ, కేసీఆర్ రెండు ఒక్కటేనని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కేసీఆర్ ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ మహా సభలు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మా ట్లాడుతూ.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అబద్ధాలు చెప్పడంలో ప్రధానమంత్రి మోదీని మించి పోయారని విమర్శించారు. ఎంఎండీఆర్ పేరుతో చట్టం ఏర్పాటు చేసి ఆ గనులను ప్రైవేట్ సంస్థలకు విక్రయిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఉన్న బొగ్గు గనుల జోలికి వెళ్లమని, కొత్త బొగ్గు గనులను విక్రయించేలా బీజేపీ ఆలోచనలు ఉన్నాయని విమర్శించారు. కిషన్ రెడ్డి మోదీతో మాట్లాడి తెలంగాణలో ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్న గనులను ప్రభుత్వానికి ఇప్పిం చేలా కృషి చేయాలని కోరారు. కేసీఆర్ ఇప్పుడు పోరాటం చేస్తామని చెబుతున్నారని.. పోరాటాలు చేసేది కేవలం కమ్యూనిస్టులు మాత్రమేనని చెప్పారు. జూలై 5 వ తేదీన కోల్డ్ బెల్ట్ ని బంద్ చేసి, కలెక్టరేట్లను ముట్టడిచేస్తామని చెప్పారు కూనంనేని.