గద్వాల, వెలుగు: నర్సింగ్ కాలేజీ పెండింగ్ పనులను త్వరగా కంప్లీట్ చేయాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. శుక్రవారం గద్వాల పట్టణ శివారులోని పరమాల గ్రామం దగ్గర నిర్మిస్తున్న నర్సింగ్ కాలేజీ, క్రిటికల్ కేర్ యూనిట్ బిల్డింగ్ పనులను పరిశీలించారు.
రూ.30 కోట్లతో నిర్మించిన నర్సింగ్ కాలేజీ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు. నర్సింగ్ కాలేజీ స్టూడెంట్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌలతులు కల్పిస్తున్నామని తెలిపారు. బిల్డింగ్ ప్రారంభించాక కూడా ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఇంటర్నల్ రోడ్లు, నీటి వసతి, ఫర్నిచర్, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
