మహబూబ్ నగర్(నారాయణ పేట), వెలుగు: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని డీపీఆర్వో రశీద్ సూచించారు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నారాయణపేట ఎస్ఆర్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి యువజనోత్సవాల కోసం కళాకారుల ఎంపిక, సైన్స్ మేళా నిర్వహించారు.
స్వామి వివేకానంద ఫొటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన కళాకారులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. డీవైఎస్వో వెంకటేశ్, వక్త నారాయణరెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు యాదగిరి జనార్ధన్ రెడ్డి, హెచ్ఎంల సంఘం అధ్యక్షుడు నిజాముద్దీన్, నరసింహ, మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.
