పటాన్‌‌‌‌చెరులో లారీ బోల్తా..కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్

పటాన్‌‌‌‌చెరులో లారీ బోల్తా..కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్

పటాన్​చెరు, వెలుగు: పటాన్‌‌చెరు పాత టోల్‌‌గేట్ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పాటి గ్రామం నుంచి లింగంపల్లి వైపు వెళ్తున్న రెడీమిక్స్‌‌ కాంక్రీట్‌‌లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌‌, క్లీనర్‌‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తునారు. లారీ రోడ్డుపై అడ్డంగా పడిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఫలితంగా ఒక కిలోమీటర్‌‌ మేర ట్రాఫిక్‌‌ జామ్‌‌ ఏర్పడింది. 

వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి లారీని తొలగించే చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌‌ను క్రమబద్ధీకరించేందుకు వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించారు. ప్రమాదానికి లారీ వేగం, అధిక లోడ్‌‌ కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో తరచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, రహదారి పరిస్థితిని మెరుగుపరచాలని అధికారులను కోరారు.