సిద్దిపేట జిల్లాలో పెండింగ్ పనులను పూర్తి చేయాలి : కలెక్టర్ హైమావతి

సిద్దిపేట జిల్లాలో పెండింగ్ పనులను పూర్తి చేయాలి  : కలెక్టర్ హైమావతి

సిద్దిపేట రూరల్, వెలుగు: జిల్లాలో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదకన పూర్తి చెయాలని కలెక్టర్ హైమావతి  అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో అధికారులతో సమావేశం నిర్వహించారు. 

కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఏంజీఎన్ఆర్ఈజీఎస్ కింద మండలాల వారీగా చేపడుతున్న అంగన్వాడీ, గ్రామపంచాయతీ భవనాలతో పాటు, ఎస్డీఎఫ్, పీఎంజీఎస్ వై కింద చేపడుతున్న వైకుంఠధామాలు, సీసీ రోడ్డులు, పీహెచ్​సీ సబ్ సెంటర్, మహిళ సమాఖ్య భవనాలు, మినీ ఫంక్షన్ హాల్, డ్రైనేజీ ఇతర నిర్మాణాలు ఫిబ్రవరిలోపు పూర్తి చెయ్యాలన్నారు. సమావేశం లో ఈఈ శ్రీనివాస్, డీఈ చిరంజీవులు, డీఆర్డీవో జయదేవ్ ఆర్య, డీడబ్ల్యూవో శారద పాల్గొన్నారు.

ఓటర్ లిస్ట్ పారదర్శకంగా తయారు చేయాలి

ఓటర్ లిస్ట్ పారదర్శకంగా తయారు చేయడానికి నియోజకవర్గం వారీగా ఒక్కో రాజకీయ పార్టీ నుంచి బీఎల్ఏస్ ను అపాయింట్ చేయాలని కలెక్టర్ హైమావతి సూచించారు. కలెక్టరేట్ లో ఓటర్ సర్వే కోసం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ స్టేషన్ వారీగా ఇంటింటి సర్వే నిర్వహించి కొత్త ఓటర్లు, షిప్టెడ్ ఓటర్లు, డెత్ ఓటర్ల లిస్టులను తయారచేయాలని సూచించారు. 

జాతీయ కుటుంబ పథకాన్ని అమలు చేయాలి

సిద్దిపేట టౌన్: జిల్లాలో జాతీయ కుటుంబ ప్రయోజన పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్​చేశారు. కలెక్టరేట్ లో రైతు స్వరాజ్య వేదిక, దళిత బహుజన ఫ్రంట్, కేరింగ్ సిటిజన్ కలెక్టివ్ సంస్థల ప్రతినిధులు కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. 

డీబీఎఫ్​ జాతీయ కార్యదర్శి శంకర్​ మాట్లాడుతూ..  జిల్లాలో 87 మంది ఈ పథకానికి అప్లై చేసుకుంటే కేవలం 39 మందికి మాత్రమే మంజూరు చేశారన్నారు.  కుటుంబ పెద్ద దిక్కు ను కోల్పోయిన కుటుంబ సభ్యులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో కొండల్ రెడ్డి, సుజాత శ్వేత, తిరుపతి పాల్గొన్నారు.