నన్ను గెలిపించండి .. సమస్యలు పరిష్కరిస్తా..తోకల శ్రీనివాస్రెడ్డి

నన్ను గెలిపించండి .. సమస్యలు పరిష్కరిస్తా..తోకల శ్రీనివాస్రెడ్డి

రంగారెడ్డి: ఎన్నికల దగ్గరపడుతుండటంతో ప్రచారం ముమ్మరం చేశారు బీజేపీ నేతలు. ఆయా నియోజకవర్గాల్లో  ప్రచారం ఊపందుకుంది. తమకు ఓటు వేసి గెలిపించాలని..అధికారంలోకి రాగానే ప్రజాసమస్యలు తీరుస్తామని హామీ ఇస్తున్నారు అభ్యర్థులు.

బుధవారం (నవంబర్ 15) రంగారెడ్డి జిల్లా  రాజేంద్ర నగర్ బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి మార్నింగ్ వాక్ ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా హైదర్ గూడ లోని తల్లకుంట పార్కులో వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం అయ్యారు. తల్లకుంట పార్క్, వాకర్స్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు.. బీజేపీ అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కారానికి కృష్టి చేస్తామని హామీ ఇచ్చారు.. బీజేపీ కి ఓటు వేసి తనను గెలిపించాలని తోకల శ్రీనివాస్ రెడ్డి కోరారు.