
నిజామాబాద్, వెలుగు: అభివృద్ధే తమ పార్టీ ఎజెండా అని బీజేపీ అభ్యర్థి ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని 6వ డివిజన్ లో కార్పొరేటర్ పంచరెడ్డి ప్రవళిక శ్రీధర్ ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి మందిరం నుంచి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలిస్తే కేంద్రంలో మోదీ చేస్తున్న విధంగానే నగరంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. కేసీఆర్ జిమ్మికులను ప్రజలు నమ్మరన్నారు. నగరంలో బీజేపీ జెండా ఎగరేస్తామన్నారు. కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, నాగోళ్ల లక్ష్మి నారాయణ, గడ్డం రాజు, భీమన్నా, శ్రీనివాస్, రాం ప్రసాద్,కార్పొరేటర్ మెట్టు విజయ్, మాస్టర్ శంకర్ ఇల్లెందుల ప్రభాకర్, బుసపూర్ శంకర్, ఇప్పకాయల కిషోర్, మీసేవ శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.