మునుగోడు బైపోల్ మూడో రౌండ్ ఫలితం

మునుగోడు బైపోల్ మూడో రౌండ్ ఫలితం

మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ మూడో రౌండ్ కూడా పూరైంది. మొదటి రౌండ్ లో టీఆర్ఎస్ ముందంజలో ఉండగా.. రెండు, మూడు రౌండ్ల‭లోనూ బీజేపీ ఆధిక్యంలోనే ఉంది. రౌండ్ రౌండ్‭కి ఫలితాల్లో మార్పు వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నికలో విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. నెల రోజుల ఉత్కంఠకు నేడు తెర పడనుంది. ఉప ఎన్నికలో తమదే విజయమని ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మూడో రౌండ్ 

మూడో రౌండ్‭లోనూ బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. మూడో రౌండ్‭లో టీఆర్ఎస్‭కు 21,489 ఓట్లు రాగా.. బీజేపీకి 21,175 ఓట్లు పోలయ్యాయి. ఇక కాంగ్రెస్ కు 5,718 ఓట్లు వచ్చాయి. మూడో రౌండ్ పూర్తయ్యేసరికి 314 ఓట్లతో బీజేపీ ముందంజలో ఉంది.

పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం
పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం కనబర్చింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డికి బీజేపీ కంటే నాలుగు ఓట్లు అధికంగా పోలయ్యాయి. ఉప ఎన్నికలో మొత్తం 686 పోస్టల్‌ ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్‌ఎస్‌ పార్టీకి 228 ఓట్లు రాగా, బీజేపీ 224, బీఎస్పీ 10, ఇతరులకు 88 పోలవగా, మిగిలినవి తిరస్కరణకు గురయ్యాయి.