
హైదరాబాద్, వెలుగు: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో నేతలు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తెలంగాణలోని వివిధ రాష్ట్రాల ప్రజలతో జాతీయ నేతలు కమ్యూనిటీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మీటింగుల షెడ్యూల్ ను పార్టీ హైకమాండ్ బుధవారం విడుదల చేసింది. జులై 1న హర్యానా వాళ్లతో జరిగే సమావేశంలో సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పాల్గొంటారు. నేరేడ్మెట్లో తమిళులతో సమావేశానికి కుష్బు, అన్నామలై, మురుగన్.. రామ్ కోఠిలో గుజరాతీల సమావేశానికి సీఎం భూపేంద్ర పటేల్, విజయ్ రుపానీ.. కూకట్పల్లిలో జరిగే మధ్యప్రదేశ్ వాసుల సమావేశానికి సీఎం శివరాజ్ సింగ్, రాజస్థాన్ కమ్యూనిటీతో శంషాబాద్లో ఎస్ఎస్ కన్వెన్షన్లో జరిగే మీటింగ్కు వసుంధర రాజె హాజరవుతారు. కర్నాటక సాహిత్య మందిర్లో కన్నడ వాళ్లతో సీఎం బొమ్మై హాజరవుతారు. హైటెక్ సిటీలో కాశ్మీర్ పండిట్లతో మీటింగ్ ఉంటుంది. మల్కాజ్గిరిలో మలయాళీల సమావేశానికి మురళీధరన్, కృష్ణదాస్ హాజరవుతారు.