బళ్లారిలో బీజేపీ, కాంగ్రెస్ నేతల ఘర్షణ

బళ్లారిలో బీజేపీ, కాంగ్రెస్ నేతల ఘర్షణ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ పలు చోట్ల అధికార పక్షం బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు ఘర్షణలకు దిగుతున్నారు. ఉద్రికత్తలు జరిగే అవకాశం ఉన్న చోట పోలీసులు బందోబస్తు నిర్వహించారు. బళ్లారిలో ఇవాళ ఉదయం బీజేపీ, కాంగ్రెస్ నేతలు గొడవ పడ్డారు. ఈ గొడవలో కాంగ్రెస్ నేత ఉమేష్ గౌడ్ తలకు గాయమైంది. ఉమేష్ గౌడ్ ఇటీవలే బీజేపీని విడిచి కాంగ్రెస్ లో చేరారు.  ఆయన ఓటు వేసేందుకు వెళ్తుండగా ప్రత్యర్థులు దాడికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. 

ఉదయం 11 గంటల వరకు 24 శాతం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిదానంగా సాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 24 శాతం పోలింగ్ జరిగింది.   మొత్తం 224 నియోజకవర్గాల్లో అన్ని పార్టీల నుంచి 2,615 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

వీరిలో 2,430 మంది మేల్ క్యాండిడేట్స్, 184 మంది ఫీమేల్ క్యాండిడేట్స్, ఒకరు థర్డ్ జెండర్ క్యాండిడేట్ ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 5,31,33,054 మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 58,545 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.