బీజేపీతోనే కొల్లాపూర్ అభివృద్ధి : ఎల్లేని సుధాకర్ రావు

బీజేపీతోనే కొల్లాపూర్ అభివృద్ధి : ఎల్లేని సుధాకర్ రావు

వీపనగండ్ల, వెలుగు: బీజేపీతోనే కొల్లాపూర్ లో అభివృద్ధి సాధ్యమవుతుందని బీజేపీ నియోజకవర్గ ఇన్​చార్జి ఎల్లేని సుధాకర్ రావు తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో యువ భరోసా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం అన్నిరంగాల్లో వెనుకబడిందని, మోసగాళ్లను నమ్మి మోసపోవద్దని సూచించారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం కృషి చేయాలని కోరరు. రామన్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, రాకేశ్, నారాయణ, మహేశ్, కేశవులు పాల్గొన్నారు.