
ఓటన్ అకౌంట్ బడ్జెట్ కంటే ఇప్పుడు రూ.32 వేల కోట్ల బడ్జెట్ తగ్గిందనీ.. ఈ బడ్జెట్ పై పూర్తి చర్చ జరగాలని అన్నారు ఎమ్మెల్సీ రాంచందర్ రావు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడిన ఆయన.. బడ్జెట్ నిరాశ పూర్వకంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం మీద నిందలు వేయటానికి చేసిన ప్రయత్నం తప్ప.. మరొకటి లేదన్నారు. కేంద్రాన్ని దోషిగా నిలబెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పులు ఒప్పుకోవడం లేదనీ.. రాష్ట్ర ఖజానా లోటులో ఉందనేందుకు చెప్పటానికి సీఎం కేసీఆర్ డొంకతిరుగుడు వివరణ ఇచ్చారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలను బాగా లేవు అని చెప్పటానికి ప్రయత్నం చేశారని విమర్శించారు.
“ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించడం లేదు…జనాలు ఇబ్బంది పడుతున్నారు….ఆయుష్మాన్ భారత్ కావాలనే తీసుకోలేదు. వాళ్ళు చేసిన తప్పును కప్పి పుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు” అన్నారు రామ్ చందర్ రావు.