ఇవాళ ధర్నాచౌక్ వద్ద బీజేపీ ధర్నా

ఇవాళ ధర్నాచౌక్ వద్ద బీజేపీ ధర్నా

హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శుక్రవారం ధర్నా చేపట్టనున్నది. ఉదయం 10 గంటలకు ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపడతామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తెలిపారు.  ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ తీరు నీరు కార్చే విధంగా ఉన్నదన్నారు. దర్యాప్తును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి తప్పుదోవ పట్టిస్తున్నట్లుగా అనిపిస్తున్నదని ఆరోపించారు. శుక్రవారం జరిగే ధర్నాలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని కాసం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.