బీజేపీ.. ఈసీ అనుమతి కోరలేదు

బీజేపీ.. ఈసీ అనుమతి కోరలేదు

హైదరాబాద్, వెలుగు:  ‘‘సాలు దొర, సెలవు దొర” క్యాప్షన్ ప్రచారం కోసం బీజేపీ.. ఈసీ అనుమతి కోరలేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ తెలిపారు. బీజేపీ దరఖాస్తును కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించిందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. తప్పుడు వార్త ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. గురువారం పార్టీ స్టేట్​ ఆఫీస్​లో రాణి రుద్రమ మీడియాతో మాట్లాడారు.

అనుమతి కోరినప్పుడు.. కేంద్ర ఎన్నికల సంఘం ఎలా రిజక్ట్ చేస్తుందని ప్రశ్నించారు. ఇదంతా అసత్య ప్రచారమని కేంద్ర ఎన్నికల‌‌ సంఘం డిప్యూటీ సీఈవో స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. తప్పుడు ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ వైఖరిని ప్రజలు గమనించాలని కోరారు.   అసత్య ప్రచారాలు చేస్తున్న టీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు.